Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

169 కి.మీ వేగంతో జలప్రళయం దూసుకొస్తే ఇంకేం మిగులుతుంది!

Nepal Glacier Collapse what remains if a disaster rushes at 169 kmph
Advertisement
  • నేపాల్‌లో విరిగిపడిన భారీ మంచు కొండ
  • గిరాంగ్ పోర్ట్‌ను పూర్తిగా తుడిచిపెట్టిన ప్రవాహం
  • గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన వరద
  • నదిలో పడటంతో 300 అడుగుల ఎత్తున ఎగిసిపడిన అలలు
  • శాస్త్రవేత్తల నివేదికలో వెల్లడైన విపత్తు వివరాలు
Advertisement
నేపాల్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఊహించని రీతిలో పెను విపత్తు సంభవించడం తెలిసిందే. ఆ జలప్రళయం 700కి పైగా ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. భారీ మంచు దిబ్బ (గ్లేసియర్) కుప్పకూలడంతో ఏర్పడిన ప్రచండమైన ప్రవాహం ఓ ప్రాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ మంచు, రాళ్ల వరద సృష్టించిన బీభత్సం వివరాలను శాస్త్రవేత్తలు తమ నివేదికలో వెల్లడించారు.

వారి కథనం ప్రకారం, లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శ్రేణిలో సుమారు 16,700 అడుగుల ఎత్తు నుంచి ఓ భారీ మంచు శిఖరం విరిగిపడింది. దాదాపు 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మంచు పర్వతం, భారీగా రాళ్లు, మట్టి సహా సమీపంలోని నదిలో కుప్పకూలింది. దీంతో నదిలో సుమారు 300 అడుగుల ఎత్తున ఓ రాకాసి అల ఏర్పడింది.

ఈ భీకర ప్రవాహం అసాధారణ వేగంతో పర్వత లోయల గుండా ప్రయాణించింది. గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ మంచు, బురద, రాళ్ల మిశ్రమ ప్రవాహం ధాటికి దాని మార్గంలోని గిరాంగ్ పోర్ట్ అనే ప్రాంతం పూర్తిగా జలసమాధి అయింది. క్షణాల్లోనే ఈ ప్రాంతం రూపురేఖలు లేకుండా సర్వనాశనమైందని శాస్త్రవేత్తలు వివరించారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement
Nepal Glacier Collapse
Langtang Lirung
Nepal Floods
Girang Port
Himalayan Landslide
Climate Change

More Telugu News